దీపావళీ తరువాత ఉపాధ్యాయుల కేటాయింపు
– కాశింపూర్ స్కూల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: బషీరాబాద్ మండలం కాశింపూర్ గ్రామంలోని స్కూళ్లో దీపావళీ తరువాత ఇద్దరు ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాశింపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో పాఠశాలలోని 175 విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయుల ఉండటంపై ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా విద్యాధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. కాశింపూర్ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. దీపావళి పండుగ తర్వాత మరో ఇద్దరిని నియమిస్తామని విద్యాధికారి తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
