ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానం
– ఎస్ఎస్ఎంవీ స్కూల్ కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానమని తాండూరు శ్రీసాయి మేధా విద్యాలయ(ఎస్ఎస్ఎంవీ) స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఉన్న శ్రీ సాయిమేధా విద్యాలయలో టీచర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, టీచర్లు పూజలు నిర్వహించారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ టీచర్లను ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి...

పేద విద్యార్థుల సేవలో..!