రేపు తాండూరుకు బండి సంజయ్ రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు బండి సంజయ్ రాక
– శివస్వాముల కుటుంబాలకు పరామర్శ
– మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి భరోసా
– ప్రకటించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రేపు గురువారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా తాండూరు ప్రాంతంలో సంచలనమైన శివ స్వాములపై కేసు, రిమాండ్ ఘటనలో బాధిత కుటుంబాలను బండి సంజయ్ పరామర్శిస్తారని సుదర్శన్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీస్తారని, కుటుంబాలకు పరామర్శ తెలియజేస్తారని అన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ జిల్లా నాయకులు మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి వెళ్లి కుటంబ సభ్యులు పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం మురళీకృష్ణ గౌడ్ కారు డ్రైవర్ బాల్ రాజ్ కుటుంబాన్ని కూడ పరామర్శించి భరోసా అందిస్తారని అన్నారు. అంతకుముందు సాయంత్రం 4-15 గంటలకు తాండూరు పట్టణం భద్రేశ్వర కూడలిలో పార్టీ పిలుపు మేరకు చేపట్టిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. అయితే బండి సంజయ్ తాండూరుకు విచ్చేస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.