సునీతా సంపత్‌కు కీలక పదవి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సునీతా సంపత్‌కు కీలక పదవి..!
– టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలుగా చాన్స్
– రేవంత్‌ సమక్షంలో నియామకం పొందే అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్‌కు ఆ పార్టీలో కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీపీసీసీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలుగా ఆమెను నియమించే చాన్స్ ఉందని నేతలు పేర్కొంటున్నారు. నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సునితా సంపత్‌ను రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలుగా నియామకపత్రం అందించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాండూరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ చైర్ పర్సన్ స్థానం కోసం కౌన్సిలర్‌గా పోటీ చేశారు. అప్పట్లో పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. అప్పటి టీఆర్ఎస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా జరిగిన సంఘటనలో అనూహ్యంగా సునీతా సంపత్ చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరవాత భర్త డాక్టర్ సంపత్ కుమార్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన కొద్ది రోజులకే సునితా సంపత్‌కు రాష్ట్ర స్థాయిలో టీపీసీసీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలుగా పదవి ఇవ్వనున్నండంతో సునితాసంపత్‌తో పాటు పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత