గుల్బర్గా రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి

క్రైం తాండూరు వికారాబాద్

గుల్బర్గా రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి
– తాండూరు వాసిగా పోలీసులు అనుమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గుల్బర్గా రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి మరణించాడు. కాగా మరణించిన వ్యక్తి తాండూరు ప్రాంతానికి చెందినట్లుగా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. గుల్బర్గా రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు ప్రాంతానికి చెందిన మురళీ (45) అనే వ్యక్తి కొన్నినెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగలూర్ లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వెళ్లాడు. మంగళవారం బెంగలూర్ నుంచి తాండూరు వచ్చేందుకు బసవ రైలు ఎక్కాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుల్బర్గాలో దిగి తాండూరు వచ్చేందుకని టిక్కెట్ తీసుకునేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన రైల్వే పోలీసులు అతని వద్ద నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు.

తన పేరు మురళి అని చెప్పినట్లు.. తనకు అనారోగ్య సమస్య ఉందని, వైద్యులు మద్యం సేవించొద్దని సూచించారని తెలిపినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అయినా అతను మద్యం సేవించి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడని చెప్పారు. అతనికి తాండూరులో ఓ కుమారుడు, కోడలు ఉన్నారని, భార్య గతంలోనే మరణించినట్లు వివరించినట్లు తెలిపారు. అంతేకాకుండా తాండూరులో రెండస్తుల భవనం ఉందని, కుమారుడు టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిపాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపర్చడం జరిగిందన్నారు. మృతుని ఆచూకీ తెలిస్తే కుటుంభీకులు గాని సన్నిహితులు గాని వాడీ రైల్వే పోలీసులను సెల్: 9480802132కు సంప్రదించాలని సూచించారు.