బీఆర్ఎస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి
– దేశవ్యాప్తంగా విస్తరించడం ఖాయం
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– సాయిపూర్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశమంతా సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్‌తో సాధ్యమవుతుందని ఆ పార్టీ తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో సాయిపూర్ 9వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పిలుపుమేరకు బీఅర్ఎస్ పార్టీ జెండా పండుగ ఘనంగ నిర్వహించడం జరిగిందన్నారు. 2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవించి, సీఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని గుర్తుచేశారు. 2022 డిసెంబర్ 08వ తేదీన భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందన్నారు.

రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా మారి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశమంతా ప్రవేశ పెట్టేలా కృషి చేస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశ రాజకీయాల్లో విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వార్డు పెద్దలు, యువకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.