ఎక్సైజ్ ఆఫీసులో వాహనాల వేలం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎక్సైజ్ ఆఫీసులో వాహనాల వేలం
– ప్రకటించిన తాండూరు ఎక్సైజ్ సీఐ
– ఎన్ని వాహనాలకు వేలం నిర్వహిస్తున్నారంటే..?
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప్ర‌జ‌ల‌కు ఎక్సైజ్ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రోభిషన్ అండ్ ఎక్సైజ్ కేసులో పట్టుబడిన వాహనాలను వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ బీ. అనంతయ్య తెలిపారు. జిల్లా ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేర‌కు రేపు గురువారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ట్ట‌ణంలోని ఎక్సైజ్ కార్యాల‌యంలో వాహ‌నాల వేలానికి ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. తాండూరు ఎక్సైజ్ శాఖ ప‌రిధిలో వివిధ కేసుల్లో ప‌ట్టుబ‌డిన 5 వాహ‌నాల‌కు ఈ వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వేలంలో తాండూరు, వికారాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు వేలంలో పాల్గొనవ‌చ్చ‌న్నారు. వేలంలో ఆసక్తి మేర‌కు వేలం పాడి వాహ‌నాల‌ను సొంతం చేసుకోవాల‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.