గూగుల్‌పేలో అదిరిపోయే న్యూ ఫీచర్..!
– వాయిస్‌తోనే డబ్బులు ఖాతాకు బదిలీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: డిజిటిల్ చెల్లింపుల్లో విప్లవాత్మకమైన గూగుల్ పేలో ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకరాబోతుంది. త్వరలో ఈ సదుపాయం అందరికి అందుబాటులోకి రానుంది. గూగుల్ పేలో హింగ్లిష్, బిల్ స్ప్లిట్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఈ ఫీచర్ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలలో నిమగ్నమైంది. మీరు వాయిస్ ద్వారా మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలనైనా సులభంగా చేయవచ్చు. యాప్‌ను యూజర్లకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హింగ్లిష్ ఫీచర్‌ను జోడించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
బిల్ స్ప్లిట్ ఫీచర్
ఇటీవల కంపెనీ గూగుల్ పే యాప్‌లో బిల్ స్ప్లిట్ ఫీచర్‌ను ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గూగుల్ పే యాప్ సహాయంతో వార్షిక ప్రతిపాదికన 400 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నాయి.
మైషాప్ ఫీచర్..
అంతేకాకుండా దుకాణదారులకు మరింత సహాయంగా గూగుల్‌పే మైషాప్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యాపారి తాను గూగుల్ ప్లాట్‌ఫామ్‌లో సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్‌పే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌పే వినియోగించే వ్యాపారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మై షాప్ సహాయంతో లావాదేవీల విషయంలో మరింత సులభంగా మారనుంది. ఈ ఫీచర్ చిన్నవ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని, త్వరలో మైషాప్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పే చెబుతోంది.