సీటు కోసం ఆడోళ్ల రభస..!

క్రైం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

సీటు కోసం ఆడోళ్ల రభస..!
– తలదూర్చి ఓవర్‌ యాక్షన్ చేసిన ఎస్ఐ
– జగిత్యాలలో ఎస్ఐ దురుసు ప్రవర్తన
– అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: బస్సులో సీటు కోసం ఇద్దరు ఆడోళ్లు రభస పడ్డారు. అందులోని ఓ మహిళ ఎస్‌ఐకు భార్య కావడంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్యకు ప్రత్యర్థిగా నిలిచిన మహిళతో ఎస్ఐ చేసిన యాక్షన్‌ కాస్త ఓవరాయక్షన్‌ అయ్యింది. ఇద్దరు ఆడోళ్ల మద్య జరిగిన పంచాయతీలో ఎస్ఐ తలదూర్చడంతో సంఘటన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జగిత్యాలతో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల అర్బన్ పోలీస్టేషన్‌లో అనిల్‌ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఓ ఆర్టీసీ బస్సులో అతని భార్య ప్రయాణిస్తుండగా సీటు కోసం అదే బస్సులోని యువతితో గొడవ జరిగింది. దీంతో ఎస్సై అనిల్ భార్య ఈ గొడవ విషయాన్ని మహిళ తన భర్తకు ఫోన్ చేసింది.

దీంతో ఎస్ఐ తాను హీరోలా అనుకుని.. తన కారులో వచ్చి బస్సును ఛేజ్ చేశాడు. బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఏస్సై అనిల్ బస్సు అడ్డుకుని చక చకా లోపలికి ఎక్కాడు. ఎవరు నీతో గొడవ పెట్టుకున్నారని భార్యతో ఆరా తీశాడు. ఎస్ఐ రెచ్చిపోయి అధికార మధంతో సదరు యువతితో అసభ్యంగా మాట్లాడాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా బసులోనే యువతిపై దురుసుగా ప్రవర్తించాడు. బస్సులోని ప్రయాణికులు ఎస్సై అనిల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై అనిల్ దురుసు ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బస్సులో ఎస్సై అనిల్‌ చేసిన ఓవరాక్షన్‌పై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై అనిల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.

ఇది కూడా చదవండి…

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!