కాంగ్రెస్ అండతో అక్రమాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ అండతో అక్రమాలు..!
– ఇసుక రవాణా, ఎర్రమట్టి తవ్వకాలు వారివే
– డబుల్‌ బెడ్‌ రూంలలో అన్యాయం చేస్తే ఊరుకోం
– బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్షాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్ పార్టీ అండతో నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ విమర్శించారు.

శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులను బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపిస్తుంటే తట్టుకోవడం లేదని విమర్శించారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీపైనే అబండాలు వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అండతో ఆ పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు.

అదేవిధంగా విచ్చల విడిగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. చెక్‌పోస్టుల్లో, రాయల్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. వీటన్నింటి వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే అని అన్నారు. తాజాగా అర్హులైన పేదలకు కాకుండా డబ్బులు వసూలు చేసి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న తప్పులు ప్రజల ముందు ఒప్పుకోవాల్సిందే అని, లేదంటే రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని అన్నారు.

బీఆర్ఎస్‌వే వసూలు రాజకీయాలు