రూ. 200 కోట్లతో కొత్త ఫించన్లు
– బార్ కోడ్‌తో పాసుపుస్తకాలు
– 15 నుంచి లబ్దిదారులకు పంపిణీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని వజ్రోత్సవ కానుకగా కొత్త ఫించన్ దారులకు ఆసరా అందించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తోంది. 15 నుంచి కొత్త ఆసరా ఫించన్లను అందించనున్న విషయం తెలిసిదే. ఇప్పటికే రాష్ట్రంలో 35.95 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉండగా.. కొత్తగా మరో 10లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందించబోతోంది. దీంతో రాష్ట్రంలో ఆసరా ఫించన్ దారుల సంఖ్య ఈ నెల నుంచి వారి సంఖ్య 46 లక్షలకు చేరుకుంటుంది. అయితే గతంలో 36 లక్షల మందికి రూ.800 కోట్ల వరకు ఆసరా ఫించన్ అధిస్తున్న ప్రభుత్వం కొత్తగా 10 లక్షల ఫించన్ దారుల కోసం మరో రూ. 200ల కోట్లను ఖర్చుచేస్తుంది. దీంతో రాష్ట్రంలో ఆసరా ఫించన్ చెల్లింపుకు ప్రభుత్వం రూ. 1000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. యేడాదికి ఒక్కో లబ్ధిదారుని ఖాతాలలో దాదాపు రూ. 12వేల కోట్ల వరకు జమ చేస్తుందన్నమాట. వజ్రోత్సవాల కానుకంగా అందిస్తున్న కొత్ ఫించన్ పంపిణికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బార్ కోడ్‌తో కూడిన పాసుపుస్తకాలను లబ్ధిదారులందరికీ అందించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి వాటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు వాటిని అందివ్వనున్నారు.
ఆసరా అర్హులు వీరే..
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. తాజాగా డయాలసిస్ పేషంట్లకు ఇవ్వాలని నిర్ణయించడంతో.. 10 రకాల క్యాటగిరీల వారికి ఆసరా పింఛన్లు అందనున్నాయి.



