ఫ్రీ హెల్త్ క్యాంపుకు ఫుల్ రెస్పాన్స్…!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఫ్రీ హెల్త్ క్యాంపుకు ఫుల్ రెస్పాన్స్…!
– 250 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మానవ సేవలో ముందు వరుసలో ఉండే తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ హెల్త్ క్యాంపుకు ఫుల్‌ రెస్పాన్స్‌ లభించింది. శనివారం పట్టణంలోని బాలాజీ మందిర్ లో హైదరాబాద్ యశోధ ఆసుపత్రి, మార్వాడి యువమంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఉదయం నుంచి జరిగిన హెల్త్ క్యాంపులో గుండె సంబంధిత సమస్యలపై 65 మందికి, కీళ్ల నొప్పుల సమస్యలపై 70 మందికి, ఈసీజీపై 145 మందికి, మరో 50 మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఇందులో 60 మందికి టుడీఈకో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే ధ్యేయంగా మార్వాడి యువమంచ్ సేవాకార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై అందరు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడీ యువమంచ్ తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, క్యాంపు చైర్మన్ దినేష్ పర్తాని, కో చైర్మన్ శ్రీగోపాల్ రాఠి, రాజస్థాని ప్రగతి సమాజ్ అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డా, రాజస్థానీ నవ యువక్ సంఘం అధ్యక్షులు మన్మోహన్ సార్డా, మంచ్ సభ్యులు అనిల్ సార్డా, దీపక్ బూబ్, ఆశిష్ సారర్డా, అభిషేక్ అగ్రవాల్, రోహిత్ సోని, యశోధ ఆసుపత్రి వైద్యులు, టెక్నిషియన్లు, నర్సులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

రైలు పట్టాలపై మృత్యుకేళీ..!

chaithany collage