ఫుడ్ మేళా అధరహో..!
– వావ్ అనిపించిన వాసవి సంఘం ప్రదర్శన
– తరలివచ్చిన నేతలు, పట్టణ ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఫుడ్ మేళా ఆధరహో.. అనిపించింది. ఆదివారం శ్రీ వాసవి మహిళా సంఘం ప్రతినిధులు కల్వ సరిత, గుబ్బ ప్రగతి, కోస్గి సరితల ఆధ్వర్యంలో ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఈ ఫుడ్ మేళాలో వాసవి మహిళ సంఘం, మార్వాడీ మహిళ సంఘం సభ్యులు, మహిళలు పోటీ ప్రదర్శనలు వచ్చారు. వేడి ఆహార పదర్ధాలతో పాటు చల్లగా, తీయగా, కారం, పులుపు వంటి వంటకాలతో ప్రదర్శన ఇచ్చారు. అథితులు, ఆహుతులు ఉత్సహంగా వంటకాలను రుచి చూసారు. ఆధరహో అంటూ కితాబిచ్చి.. మైమరిచిపోయారు. మహిళలు, చిన్నారులతో ఫుడ్ మేళా సందడిగా మారింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచి ఆరోగ్యకరమైన ఆహార వంటకాలను ప్రదర్శిస్తూ అందించడం అభినందనీయమన్నారు. శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను అందరు తెలుసుకోవాలన్నారు. మరోవైపు ఫుడ్ మేళా సందర్భంగా విద్యార్థులు, చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మంకాల్ రాఘవేందర్, నగరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మురళీధర్, పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ భాను, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శులు కోట మురళీ, శ్రీ వాసవి, ఆర్యవైశ్య, మార్వాడి మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

