చలో.. ఎల్బీ స్టేడియం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చలో.. ఎల్బీ స్టేడియం..!
– ఖర్గే సభకు తరలిన తాండూరు నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చలో.. ఎల్బీ స్టేడీయం అంటూ తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యర్తలు హైదరాబాద్ తరలివెళ్లారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటి అధ్యక్షులు, క్రీయాశీలక కార్యకర్తల సమ్మేళనం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఇందులో భాగంగా తాండూరు నుంచి సమావేశానికి నాయకులు ఆర్టీసీ బస్సుల్లో రాజధాని బాట పట్టారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు బంటు మల్లప్ప, పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాల, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్ కుమార్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

అదేవిధంగా తాండూరు మండలం నుంచి పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, కోతి గోపాల్, సిరిగిరిపేట్ పండరి, పలువురు నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి నేతలు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరి వెళ్లారు.

ఇదికూడా చదవండి…

తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి