తాండూరు కవులకు సన్మానం
– జిల్లా స్థాయి కవి సమ్మేళనంలో గౌరవం
– ఆకట్టుకున్న పద్యాలు, పాటలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా స్థాయి కవి సమ్మేళనంలో తాండూరు కవులకు సన్మానం దక్కింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తదితరుల సమక్షంలో తాండూరు ప్రాంతానికి చెందిన కవులు కోటం చంద్రశేఖర్, పడిచర్ల సత్యం, హాజీపూర్ శ్రీనివాస్, ప్రతిభా భారతిలను సన్మానించారు. ఈ సమ్మేళనంలో వారు చదివి వినిపించిన తెలంగాణ ఆస్తిత్వం, అభివృద్ధి అంశాలపై పద్యాలు, పాటలు, మణిపూసలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రేణుకా దేవి, జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, వికారాబాద్ మండల పరిషత్ అధ్యకులు కామిడి చంద్రకళ, ఎంపీడీఓ సత్తయ్య, కార్యక్రమ సంయోజకులు వీరకాంతం, వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, కళాకారులు, పండితులు, విద్యార్థులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…


