హలో.. డీఎం గారు..!
– నేడు ఆర్టీసీలో డయల్ యువర్ డీఎం
– బస్సు సర్వీసు ఫిర్యాదులకు అవకాశం
– ఏ నెంబర్‌లో సంప్రదించాలంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలోని బస్సు సర్వీసులపై నేడు డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీపో మేనేజర్ సమత ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో డీపో పరిధిలో వివిధ ప్రాంతాలలోని ఆర్టీసీ బస్సు సర్వీసుల సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చన్నారు.. అదేవిధంగా సలహాలు, సూచనలు కూడా అందించవచ్చన్నారు. ప్రజలు, ప్రయాణికులు సెల్: 9959226251 లేదా 9959226241లకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి…


