సిచ్యూవేషన్ అండర్ కంట్రోల్..!
– ఆందోళన వద్దు.. పుకార్లు నమ్మొద్దు
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– స్కూళ్ల మూసివేతపై మంత్రి క్లారిటీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో ప్రజెంట్ సిచ్యూవేషన్ అండర్ కంట్రోల్‌లో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు ఓ వైపు.. తరుముకొస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మరోవైపు.. వెరసి ఈ మధ్యనే తెరుచున్న పాఠశాలలను మూసివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను బడికి పంపాలా వద్దా అన్న డైలామా ఉన్నారు. వీటన్నింటికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రిసబితా ఇంద్రారెడ్డి స్కూళ్లపై క్లారిటీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ బడులు మూసివేస్తారన్న పుకార్లు నమ్మవద్దని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు నష్టపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అక్కడక్కడ స్కూళ్సు, గురుకుల పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు వాస్తవమేనని, అయితే ఆందోలన చెందే పరిస్థితి లేదన్నారు. విద్యాలయాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. స్కూల్స్ లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో పాఠశాలల మూసివేత అంటూ వస్తున్న రూమర్స్ పై మండిపడ్డారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి…సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
