ఘనంగా ఈద్-ఉల్-జుహా..!
– ఈద్దా, మసీదుల్లో ప్రార్ధనలు
– వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఈద్-ఉల్-జహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తరలివచ్చి సామూహిక ప్రార్ధనలు చేశారు.

ఈ సందర్భంగా మత ప్రవక్తలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ విశిష్టతను తెలిపారు. ఈద్గాల వద్ద జరిగిన వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లిం సంక్షేమానికి తోడ్పాడు: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరులో ముస్లింల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలు పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గతంలో తాండూరులోని ఈద్గా కమిటితో పాటు ముస్లింల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడ ఈద్గా అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో ముస్లిం సోదరులు కోరిన విధంగా రెండు చోట్ల స్మశాన వాటికలకు స్థలం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మైదానంలో విద్యుత్ దీపాలు, ప్రహారీగోడ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ పట్లోళ్ల సర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, గడ్డలి రవీందర్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, బీఆర్ఎస్ యువనాయకులు బిడ్కర్ రఘు, అశోక్, ఇంతియాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రముకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉన్నారు. తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు..
ఇది కూడా చదవండి…


