ఆవు.. వీరంగం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆవు.. వీరంగం..!
– దారిన వెళ్లే వారిపై దాడి, పలువురుకు గాయాలు
– పట్టుకుని గోశాలకు ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పుర వీధుల్లో ఓ ఆవు వీరంగం సృష్టించింది. ఈ సంఘటన సోమవారం పట్టణ వాసులను భయాందోలనకు గురిచేసింది. ఆవు చేసిన దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. తాండూరు పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ఆవును బజారున వదిలేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అకస్మాత్తుగా ఆవు ప్రజలపై దాడికి పాల్పడుతూ వీరంగం సృష్టించింది.

దారిన వెళ్లే వారిపై దాడి చేస్తూ గాయాలపాలు చేసింది. ఆవు దాడులతో పట్టణ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి స్పందించారు. గోశాలకు చెందిన యువకులు, గోసంరక్షక యువకుల సహాయంతో పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆవును గుర్తించి పట్టుకున్నారు. చైర్మన్ బాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని యువకుల సాయంతో ఆవును బంధించారు. ట్రాలీ వాహనంలో బందించిన ఆవును గోశాలకు తరలించారు. గోశాలలో ఆవును కట్టేశారు. ఆవును గోశాలకు తరలించడంతో ప్రజలు ఊరట చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి స్పందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఈ ఆవుకు కుక్క కాటు వేయడంతో ఈ విధంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

అయ్యో.. దేవుడా..!