ఆద‌ర్శ‌మూర్తి సావిత్రిబాయి పూలే

తాండూరు వికారాబాద్

ఆద‌ర్శ‌మూర్తి సావిత్రిబాయి పూలే
– ఆమె ఆశ‌యాల‌ను నెరేవేర్చేందుకు కృషి చేయాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
– బీసీ సంఘం రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మ‌హిళ‌ల అభివృద్ధి కోసం కృషి చేసిన తొలి మ‌హిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అంద‌రికి ఆద‌ర్శ‌మూర్తి అని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు అన్నారు. సోమవారం బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 191 జయంతి వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల నర్సింలు, టీజేఏస్ ఫోర్ లీడర్ సోమశేఖర్, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్, టీఆర్ఎస్ కౌన్సిలర్ రాము తదితరులు హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలుతో పాటు పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కృషి వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కమల్ అతహర్, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, జుంటుపల్లి వెంకట్, కాంగ్రెస్ యువనాయకులు బంటు వేణుగోపాల్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు అంకిత్, బీఎస్పీ తాండూరు ఇంచార్జ్ సత్యమూర్తి దొరశెట్టి.. రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ మండలాల అధ్యక్షులు లక్ష్మణాచారి, నరేందర్ ముదిరాజ్, బాలు యాదవ్, నర్సిం బీసీ హా, నర్సింహా నాయి, మహేష్, స్వేరోస్ ఇంచార్జ్ శివ, ఇందూరు మతిన్, రమేష్, అశోక్, అంతారం సంతోష్, సురేష్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.