బొడ్రాయి ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

బొడ్రాయి ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే చేయూత
– రూ. 1లక్ష 1,116లు విరాళం అందజేత
– కృతజ్ఞతలు తెలిపిన ఉత్సవ కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు సుభీక్షం కోసం పట్టణ నడిబొడ్డున ప్రతిష్టించిన బొడ్రాయి ప్రతిష్టాపనకు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేయూత అందించారు. గత మూడు రోజులుగా పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉత్సవ కమిటి సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. కాళికాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బొడ్రాయి ప్రతిష్టాపన కోసం రూ. 1లక్ష 1,116లు విరాళం అందించి తనవంతు చేయూతను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు సుభీక్షం కోసం తనవంతుగా శతచండి, అతిరుద్ర యాగాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేసమయంలో పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన చేయడం శుభపరిణామం అని అన్నారు. తాండూరు సంక్షేమం కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రూ. 1లక్ష 1,116లు అందించడం పట్ల బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవ కమిటి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తీరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఉత్సవ కమిటి సభ్యులు బిర్కడ్ నారాయణ, నరుకుల నరేందర్ గౌడ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage