సమాజం మెచ్చే సేవలు..!
– వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో చలివేంద్రం
-అభినంధించిన వీరశైవ సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజం మెచ్చే సేవలు చేస్తామని తాండూరు వీరశైవ యువదళ్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వీరశైవ సమాజం కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమాజం సభ్యులు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువదళ్ సభ్యులు మాట్లాడుతూ ఇటీవలే నూతన కార్యవర్గంగా ఏర్పాటైన సందర్భంగా తొలిసారి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం సభ్యులందరి సహాకారంతో అందరు మెచ్చే సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు.
వచ్చే పౌర్ణమికి అన్నదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీరశైవ యువదళ్ చేస్తున్న సేవ కార్యక్రమాలను సమాజం పెద్దలు అభినందించారు. వీరశైవ సమాజం నుంచి తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, జొన్నల బస్వరాజ్, శెట్టి భాస్కర్, తంబాకు చంద్రశేఖర్, వీరశైవ యువదళ్ అధ్యక్షులు ఆడికి శశాంక్, మఠం జగదీశ్వర్, రవి కుమార్. శివప్రసాద్, గాండ్ల పరమేష్, మద్రిక చంద్రకాంత్, కిరణ్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

