అట్టహాసంగా విశాల్ మెగా మార్ట్ ప్రారంభం

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా విశాల్ మెగా మార్ట్ ప్రారంభం
– రిబ్బన్‌ కట్ చేసిన బిల్డింగ్ యజమాని సుశీల గజలప్ప
– హాజరైన బీసీ నేత రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విషాల్‌ మెగా మార్ట్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమయ్యింది. శనివారం పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద షాపింగ్ మాల్‌ను భవన యజమాని సుశీల గజలప్ప ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ జిల్లాలోనే కనివిని ఎరుగని రీతిలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలకు అన్ని వస్తువులు లభించే విధంగా విశాల్ మేఘమాట్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన మిత్రులు కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ప్రముఖ వ్యాపారవేత నితిన్ సోమని టిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీసీ నాయకులు సయ్యద్ సుకుర్, లక్ష్మణ చారి, బెజ్జూ రమేష్, బెజ్జు నగేష్ , వాణిజ్య సముదాయ యజమానులు, ఉపాధ్యాయులు కందుకూరి ప్రవీణ్ కుమార్, వాణి, అన్నపూర్ణ, మనస్వి, చైత్ర, వేదాన్షి, రేయాన్స్, విశాల్ మెగా మార్ట్ సౌత్ ఇండియా ప్రదీప్ రానా తెలంగాణ హెడ్ రమేష్, ఏరియా సేల్స్ మేనేజర్ సందీప్, తాండూర్ ఇంచార్జ్ తుకారం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాల్ షాపింగ్‌ మార్ట్ ప్రారంభం సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొనుగోలు దారులతో మాల్‌ కిక్కిరిసి పోయింది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage