ప్రైజ్ పరేషాన్..!
– జెండా బహుమతి ఎంపికలో లొల్లి
– ఎమ్మెల్యే ముందు అసంతృప్తి
– నిర్వహకులపై ఎమ్మెల్యే మండిపాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన సామూహిక జెండా వేడుకలో అందించిన ప్రైజ్ పరేషాన్‌కు దారి తీసింది. బహుమతి ఎంపికలో పక్షపాతం ప్రదర్శించారనే అభిప్రాయాలు వెలువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహకులపై మండిపాటు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రతి యేడాది పంద్రాగష్టుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సామూహిక జెండా వందన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల నుంచి విద్యార్థులు గౌరవ వందన సమర్పణ, నృత్య ప్రదర్శనలు ఇవ్వడం కామన్. కార్యక్రమం అనంతరం ఉత్తమ ప్రదర్శన స్కూళ్లకు బహుమతులు అందజేస్తారు. ఈ సారి కూడా సామూహిక వేడుకల్లో పలు పాఠశాలల నుంచి గౌరవ వందనం, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మొదటి బహుమతి కోసం శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్‌తో పాటు కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూళ్లు పోటీపడ్డాయి.
నిర్వహకులు శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్‌కు మొదటి బహుమతి, కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్ కు రెండో బహుమతి ప్రకటించారు. కార్యక్రమం తరువాత బహుమతి ఎంపికలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ట్రెడిషన్ లుక్ చూసి బహుమతిని ఎంపిక చేశారని పలువురు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముందు వాపోయారు. ఓ ప్రజా ప్రతినిధి కూతురు ఆ స్కూళ్లో చదువుతున్నందున నేతాజీ స్కూల్‌కు మొదటి బహుమతి ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహకులుపై మండిపడ్డారు. కమిటి లేకుండా బహుమతులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. అనంతరం నేతాజీ స్కూల్‌కు కాకుండా కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌కు మొదటి బహుమతిని ప్రకటించాలని సూచించారు.
ఇది కూడా చదవండి…

