బీఎస్పీ నాయకుల్లారా ఖబడ్దార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఎస్పీ నాయకుల్లారా ఖబడ్దార్..!
– ఎమ్మెల్యేపై ఓర్వలేని విమర్శలు మానుకోండి
– బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యేపై ఓర్వలేని రాజకీయాలు చేస్తే సహించేది లేదని బీఎస్పీ నేతల్లా ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి హెచ్చరించారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నేతలు చేసిన విమర్శలను సందీప్ రెడ్డి ఖండించారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇదేమీ కంటికి కనబడనట్లు బీఎస్పీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

కేవలం ఎన్నికలకు ముందు వచ్చి బురదజల్లే రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాలుగేళ్లు వ్యాపారాలలో మునిగి ఎన్నికల ముందే ఏదో ఉద్దరించినట్లు కల్లబొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మరని తెలుసుకోవాలని సూచించారు. ఒక గల్లీకి లీడర్‌గా గెలవలేని వాళ్లు ఎమ్మెల్యేపై విమర్శలు చేసి ఏదో సాధించామనుకోవడం ఉట్టి భ్రమే అని విమర్శించారు. అన్ని వర్గాల వారి సంక్షేమం, న్యాయం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నోరుజారితే సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ బీఎస్పీ నేతలకు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!