పేదల సేవలకు ప్రాధాన్యం
– ఎన్‌ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ
– తాండూరు పీపుల్స్ డిగ్రీ కాలేజీలో కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద ప్రజలు, పేద విద్యార్థుల సేవలకు నూలి శుభప్రద్ పటేల్(ఎన్ఎస్పీ) ట్రస్టు ప్రాధాన్యమిస్తోందని ట్రస్టు సభ్యులు అన్నారు. సోమవారం ట్రస్టు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో పేద విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు కార్యదర్శి భాను ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ సహాకారంతో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి యేడాది సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం చేయూతనందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ట్రస్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, అధ్యాపకులు, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు బాలు, చంద్రశేఖర్, శ్రీశైలం, నరేష్ గౌడ్, సాయి కుమార్, విజయ్, రమేశ్ నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి…

