క్రీయేవిటీ ‘ఉచ్చు’లో యూట్యూబర్స్‌..!

క్రైం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

క్రీయేవిటీ ‘ఉచ్చు’లో యూట్యూబర్స్‌..!
– వ్యూస్‌, లైకుల కోసం పిచ్చిపని
– వైల్డ్ లైఫ్‌ సెక్షన్లతో జైలుపాలు
– అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్, దర్శినిప్రతినిధి : చేతిలోకి టెక్నాలజీ వచ్చాక ప్రతి ఒక్కరిలో క్రీయేటివిటి పెరిగింది. తమలోని సృజనాత్మకతను ప్రేక్షలకు చూపించాలని యూట్యూబ్, ఇతర మార్గాల్లో ఆప్‌లోడ్ చేస్తూ వ్యూస్‌ పొందుతున్నారు. ఇందులో కొందరికి వ్యూస్ ఎక్కవగా వస్తే, మరికొందరికి తక్కువగా వస్తుంటాయి. తక్కువ వ్యూస్‌ వచ్చిన వారు వ్యూస్‌ పెంచుకునేందుకు తింగర పనులు చేస్తుంటారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా ఆ పిచ్చిలో పడి జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఓ ఘటన వరంగల్‌లో వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు “విలేజ్ థింగ్స్”పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు.. చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వీవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. తమ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పై ఎక్కువ వ్యూస్ రాబట్టడం కోసం ‘అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి’ అనే టైటిల్ ఎంచుకొని అడవిలో అడపలతో అడవి కోళ్లను వేటాడం ఎలా అనే వీడియో తీశారు. వీడియోలో అడపలతో(పెద్ద రాయి) ఉచ్చును బిగించి అందులో అడవి కోడి ఒకటి పడ్డట్టు, దాన్ని చంపి కాల్చి తింటున్నట్టు వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్ లో 8 నవంబర్ 2022 లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంట పడింది.. అటవీశాఖ ఉన్నత అధికారుల కంట పడటంతో ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులపై ఫారెస్ట్, పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ వీడియోలు తీసిన యువకులు మాత్రం మేము ఉచ్చును బిగించిన మాట వాస్తవమే కానీ అది అడవి ప్రాంతంలో కాదని, అందులో పడ్డ కోడి మా ఊరు నుండి మేము తీసుకెళ్లి ఉచ్చులో పడినట్టు చిత్రీకరించామని చెప్పుకొచ్చారు. అది అడవి కోడి కాదని, పెరటి కోడితో వీడియో చేస్తే ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు ఆవేధన వ్యక్తం చేశారు. మరోవైపు ఆటవిశాఖ అధికారులు మాత్రం ఇలాంటి వీడియోలకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటనతో యూట్యూబర్లలో ఆందోళన కలిగింది.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!