జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత
– కళ్యాణ మండపం ఏర్పాటు అభినందనీయం
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత అందించడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సీతారామ స్వామి దేవాలయంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వార్లను దర్శించుకున్నారు.

అనంతరం స్వర్గీయ సరస్వతీ పర్తాని జ్ఞాపకార్థం పర్తాని కుటుంభీకులు దేవాలయం వద్ద నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణానికి శ్రీనివాస్ రెడ్డి పర్తాని కుటుంభీకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు జుంటుపల్లి రామస్వామి దేవాలయానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. దేవాలయంలో కళ్యాణ మండప నిర్మాణానికి పర్తానీ కుటుంభీకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటి చైర్మన్ శ్యాం సుందర్ రావు, పర్తాని కుటుంభ సభ్యులు ఓం ప్రకాష్ పర్తాని, శ్రీకుమార్, వెంకట్ రెడ్డి, విజయ్, మురళీ, ఉప్పరి మల్లేష్, బి. ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడాలి