ఎలక్షన్స్‌పై స్పెషల్ ఫోకస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎలక్షన్స్‌పై స్పెషల్ ఫోకస్..!
– అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై దృష్టి
– తాండూరులో కర్ణాటక పోలీసులతో సమావేశం
– సరిహద్దు సమన్వయ చర్యలపై డీఎస్పీ సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తాండూరు పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో సమన్వయ చర్యలకు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో తాండూరు సబ్‌ డివిజన్ పోలీసు అధికారులతో, కర్ణాటక రాష్ట్రం చించొల్లి, ముధేల్‌ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ కర్ణాటక రాష్ట్రం చించొల్లి డీఎస్పీ బస్వరాజ్, పోలీసు అధికారులతో అసెంబ్లీ ఎన్నికల విధులపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందున్నారు. ముఖ్యంగా అక్కడా, ఇక్కడా డబ్బు, మద్యం ఇతర అక్రమ రవాణా జరగకుండా దృష్టిసారించాలన్నారు. సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిసేందుకు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక రాష్ట్రం ముద్గల్ సీఐ, చించొల్లి ఎస్ఐలతో పాటు తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఎస్ఐలు వేణుగోపాల్, కాశినాథ్, అరవింద్. విమల తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!