కేవీసీఎస్‌లో రిపబ్లిక్‌ డే అదుర్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేవీసీఎస్‌లో రిపబ్లిక్‌ డే అదుర్స్..!
– అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
– మైమరిపించిన అయోధ్య రామ ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం పొట్లిమహారాజ్ దేవాలయం ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్)లో శుక్రవారం రిపబ్లిక్‌ డే వేడుకలను అదుర్స్‌ అనేలా జరుపుకున్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. జెండా వందనం తరువాత పాఠశాల యజమాన్య కమిటి సభ్యులు మల్లేపల్లి వెంకటేశం. డైరెక్టర్ ప్రిన్సిపల్ ప్రశాంతు, సతీష్ లు విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చక్కటి అభినయాలతో పాటు నైపుణ్యాలను ప్రదర్శించి మైమరిపించారు. ముఖ్యంగా దాదాపు 15 నిమిషాల పాటు అయోధ్య రాముని, రామాయణ నాటక ప్రదర్శన ఇచ్చారు. అత్యద్భుత నృత్య ప్రదర్శన ఇస్తూ కనువిందు చేశారు. రామాయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి అందరిని మైమరింపజేశారు.

ఈ సందర్భంగా యజమాన్యం, ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యత, ప్రమాణాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!