తాండూరు ప్రజలకు శుభవార్త..!
– పట్టణంలో మూడు ఆధార్ కేంద్రాలు
– సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ ప్రజలకు అధికారులు శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలతో పట్టణంలో మూడు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం తాండూరు పట్టణం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మూడు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర మండలాలకు చెందిన కేంద్రాల నిర్వహకులతో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకవస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత నుంచి లేదా బుధవారం ఉదయం నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకవస్తున్నారు.
అయితే వారం రోజులు మాత్రమే ఈ కేంద్రాలు కొనసాగుతాయని ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పేర్లు మార్పిడి, బయో మెట్రిక్, మోబైల్ అనుసంధానం సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త ఆధార్ కార్డులు, అడ్రస్ మార్పు సేవలను అందించడం లేదన్నారు. ఈ వారం రోజుల్లో పట్టణంలో ఒక శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ఆధార్ వినియోగదారులు ఈ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కోసం, ఇతర అవసరాల కోసం ఆధార్‌ను ఈకేవైసీ చేయించుకోవాలని సూచించడంతో తాండూరులో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో మూడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వినియోదారుల కష్టాలు తీరనున్నాయి.
ఇదికూడా చదవండి…

