అంగన్ వాడీల డిమాండ్లను పరిష్కరించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అంగన్ వాడీల డిమాండ్లను పరిష్కరించాలి
– కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అంగన్ వాడిల డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. గత 5 రోజులుగా తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు సీఐటీయూ నేతలతో కలిసి ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్ వాడిలను ప్రభుత్త ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, అంగన్ వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తాండూరు అధ్యక్షురాలు బేబీ, ఉపాధ్యక్షురాలు జయంతి, శోభ, చంద్రకళ, హారతి, రమాదేవి, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!