కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు
– రోహిత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం
– రితేష్ రెడ్డి సమక్షంలో యువకుల చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ పరిధి 16, 18వ వార్డులకు చెందిన పాత యువకులు రితేష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రితేష్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, ఆ పార్టీని నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. తాండూరు అభివృద్ధి కోసం ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రం శ్రీధర్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

