బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..!
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
– ప్రజా గర్జన సభకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పాలమూరులో నిర్వహించిన నరేంద్ర మోడి ప్రజా గర్జన సభకు యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 3 వేల మంది నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో 9 ఏండ్లు పాలించిన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు విసుగు చెందారని. అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వివక్ష పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో ప్రధాని మోడి బీజేపీ ద్వారా తెలంగాణ ప్రజలకు భరోసా అందిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, సందీప్, మైపాల్ యాదవ్, గంగాదర్, జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, బాలప్ప, నాయకులు పూజారి పాండు, మల్లేష్ యాదవ్, మోత్కుపల్లి చంద్రశేఖర్, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు