పళ్లు తోమితే పైసల్ కట్టాలే..!

క్రైం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

పళ్లు తోమితే పైసల్ కట్టాలే..!
– రూల్స్ పాటించకుంటే జరిమాన తప్పదు
– రైల్వే స్టేషన్‌లో నిబంధనలు తెలుసుకోండి
దర్శిని డెస్క్ : అదేంటి పళ్లు తోముకుంటే పైసల్ కట్టాల్నా..? అని ఆశ్చర్య పోతున్నారా..! అవును మీరు చదివింది నిజమే. రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనను పాటించకుంటే జరిమాన విధిస్తారని చాలా మందికి తెలియదు. దేశంలోని లక్షలాది మందికి తక్కువ ఖర్చుతో ప్రయాణించే సదుపాయం రైళ్లు మాత్రమే. అందుకే వివిధ ప్రాంతాల్లో చాలా మంది రైల్వే మార్గంలో ప్రయాణం సాగిస్తుంటారు. కొంత మంది రోజుల తరబడి కూడా ప్రయాణం చేస్తారు. అయితే వారికి కూడా తెలియని నిబంధనలు ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తోంది. రైలులో ఎక్కువ దూరం ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఉదయం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్లాట్‌ఫారమ్‌లోని కుళాయిల వద్ద పళ్ళు తోముకోవడం, రాత్రి భోజనం చేసిన పాత్రలను కూడా కడగడం మనం చూస్తుంటాం.

ఆ తరువాత, కాఫీ, టీ లు, బ్రేక్‌ఫాస్ట్‌ కూడా అక్కడే చేస్తుంటారు. కానీ మీకు తెలుసా, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కుళాయి, వాష్‌ ఏరియాలో తప్ప ఎక్కడ పడితే అక్కడ పళ్లు తోముకోవటం నేరం. ఇలాంటి పనులు చేస్తే రైల్వే చట్టం 1989 ప్రకారం జరిమానాలు విధిస్తారు. రైల్వే ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశాలు కాకుండా మరేక్కడైనా బ్రష్ చేయడం, ఉమ్మివేయడం, టాయిలెట్ చేయడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం వంటివి చేయటం నేరం కిందకు వస్తాయి. మరుగుదొడ్లు, నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే ఈ పనులు చేయాలి. ఈ నిషేధిత చర్యలకు పాల్పడివారిని రైల్వే సిబ్బంది పట్టుకుంటే, ఆ ప్రయాణీకుడికి రూ. 500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదేవిధంగా చిప్స్ లేదా ఇతర వస్తువులు తిన్న తర్వాత, చాలా మంది ప్రయాణికులు స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో రేపర్లను విసిరివేస్తుంటారు. ఇది కూడా నేరమే. నిర్ణీత ప్రదేశంలో తప్ప ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడవేయకూడదు. అంతేకాకుండా మీరు రైల్వే లేదా రైల్వే ప్రాంగణంలో ఎక్కడైనా ఏదైనా వ్రాసినా లేదా ఏదైనా పోస్టర్ వేసినా అది కూడా రైల్వే చట్టం ప్రకారం జరిమానా విధించవచ్చు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!