ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్‌తో రాజకీయాలు తగదు
– నాయకులు ఉన్నా రాజకీయాలకు సంబంధం లేదు
– తాండూరు అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొందరు రాజకీయాలు చేయడం తగదని తాండూరు అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కమల్ అతహర్, సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాజీ అధ్యక్షులు ఖుర్షీద్ హుస్సేన్ ను అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగిందన్నారు. అయినా కూడా తాను అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నానని మభ్యపెడుతున్నారని అన్నారు. పలువురు పార్టీల నాయకులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అయితే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ పై తప్పుడు పత్రాలు సృష్టించడంతో ఆయనపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హది షహేరీ కూడా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కాంప్లెక్స్ ను వర్ఫ్ బోర్డుకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్ ను వక్స్ బోర్డుకు అప్పగించకుండా రక్షించుకునేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ లో అన్ని పార్టీల నాయకులు ఉన్నప్పటికి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

