ఎల్ల‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి

తాండూరు వికారాబాద్

ముగిసిన రేణుకా ఎల్లమ్మ జాతర
– దర్శించుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాలు శనివారం కూడ కొనసాగాయి. ఇందులో భాగంగా ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రతి త్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అన్నదానం నిర్వహించారు. మరోవైపు రెండో రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంట కూడ పట్టణ భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డి సీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవీందర్,సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ యువనాయకులు అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, ఆలయ కమిటీ, హామాలి కార్మిక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.