హ్యాపీ బర్త్ డే రాజన్న…!

తాండూరు రాజకీయం వికారాబాద్

హ్యాపీ బర్త్ డే రాజన్న…!
– ఘనంగా రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు
– తాండూరులో, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పోరాడే నాయకుడిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా వికారాబాద్ జిల్లా తాండూరులో బిసి ఉద్యమ నేతగా పేరు పొందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజవర్గ కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి జన్మదిన వేడుకలు మిత్రులు, శ్రేయోభిలాషులు, యువకులు, బీసీ సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రాజ్ కుమార్ జన్మదినం సందర్బంగా తాండూరు పట్టణంలో పలు వార్డులతో పాటు పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు, యాలాల మండలాల్లోని పలు గ్రామాల్లో యువకులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాండూరు మాత శిశు ఆసుపత్రిలో ఉదయం రాము ముదిరాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అల్పాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు.

మహిళా ఉపాధ్యక్షురాలు అనిత రాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లోని అంగన్వాడి విద్యార్థులకు టిఫిన్ బాక్స్లు పంపిణీ చేశారు, పెద్దముల్ మండల అధ్యక్షులు శ్రవణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. యువకులు పెద్ద ఎత్తున రాజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఒక పండుగల నిర్వహించరు యువకులు తాండూరు ప్రాంతంలో పలుచోట్ల రాజ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలో విశాల్ మార్ట్ దగ్గర ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ సంపత్ కుమార్ గారు పాల్గొని కేక్ కట్ చేసి రాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, తట్టేపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజయ్య ముదిరాజ్, వీరేశం, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాయకుడు జ్యోతి, ఉపాధ్యక్షురాలు అనితరాజ్, బీసీ సంఘం మండలాల అధ్యక్షులు నరేందర్, బసంత్ కుమార్, మీడియా ఇంచార్జ్ బసవరాజ్, నాయి బ్రాహ్మణ సమాజం నాయకులు పరమేశ్వర్, కుమ్మరి సమాజం నాయకులు అంజన్న, రవీందర్, పాండు బిసి సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, జంటుపల్లి వెంకట్, హరి ప్రసాద్, దుబాయ్ వెంకట్, పాండుగౌడ్, అనిల్, శివ, సాయి, ఎల్లప్ప, పలు కుల సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం