ఇంటింటికి సంక్షేమ పథకాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటింటికి సంక్షేమ పథకాలు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం తాండూరు పట్టణంలోని 19వ వార్డులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో హామి ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజా పాలన చేపట్టిందన్నారు.

ఇంటింటి నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రజా పాలన అభయ హస్తంకు అందరు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అందరు నా కుటుంబ సభ్యుల్లా భావించి సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ శ్రీనివాస రావు, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ ముక్తార్, ప్రభాకర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, పలు శాఖల అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం