బోనమెత్తిన సాయిపూర్..!
– వైభవంగా ఆషాడం బోనాల జాతర
– ఈశ్వరమ్మ, కట్టమైసమ్మలకు మొక్కులు
– దర్శించుకున్న నేతలు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్ బోనమెత్తింది. ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం తాత గుడి సమీపంలోని ఈశ్వరమ్మ, సాయిపూర్లోని కట్ట మైసమ్మ దేవతల జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సాయిపూర్ లోని ఇంటింటి నుంచి మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు.

సాయిపూర్ వీధులు బోనాలతో ఆషాడం బోనాల శోభ సంతరించుకున్నాయి. బోనాల జాతరలో భాగంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మ నర్సింలులు కూతురులతో కలిసి బోనం ఎత్తుకు వచ్చారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి కూడా బోనం ఎత్తుకుని వచ్చారు. ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలతో పాటు ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మరోవైపు జాతర ఉత్సవాల్లో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, ఇందూరు రాములు, జగదీశ్వర్, సాయిపూర్ పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇదికూడా చదవండి…

