స్పూర్తిదాయకుడు స్వామి వివేకానంద

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

స్పూర్తిదాయకుడు స్వామి వివేకానంద
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– చెంగోల్, తాండూరు పట్టణంలో నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశానికి, యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడు అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను నిర్వహించారు. తాండూరు మండలంలోని చెంగోల్లో నిర్వహించిన యువజన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెంగోల్ ఎంపీటీసీ రత్నమాల రాము, యువజన నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అదేవిధంగా తాండూరు పట్టణం శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి, యువతకు స్ఫూర్తి దాయకుడని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్. డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, చెంగోల్ రాము, వడ్డె శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, యువనాయకులు తాండ్ర రాకేష్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మన్మోహన్ సార్ధా తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం