అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..!
– ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నిర్ణయం
– రైల్లు ఎక్కడి నుంచి అందుబాటులో ఉంటాయంటే..?
దర్శని ప్రతినిధి : ఇక ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ మహాక్రతువు కోసం దేశ వ్యాప్తంగా చాలా మంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు. భక్తుల సంఖ్య రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ ప్రయాణికులు, రామ భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంటోంది. అయోధ్యకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మరోవైపు 10.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రామ భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!