మళ్లీ రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!
– వచ్చే నెలాఖరులోగా కొత్త కార్డులు జారీ
– కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తులతో సంబంధం లేకుండా కొత్త దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. ప్రజాపాలన మీద రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆరు గ్యాంటీల అమలు కోసం అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల కోస్ దరఖాస్తులను స్వీకరించి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటి కోసం అర్హతదారులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతోంది. మీసేవ కేంద్రాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సంకేతాలు ఇస్తుంది.
ఇప్పటికే ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు తీసుకున్న అధికారులు…అందులో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నవి పరిగణించడం లేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు రేషన్‌కార్డులే ప్రామాణికంగా నిలవనున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అభయహస్తంకు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డులు కావాల్సిందే. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అప్లికేషన్ల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే.. రేషన్ కార్డుల అప్లికేషన్లను స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
ఇదికూడా చదవండి…

