ఆక‌ట్టుకున్న మ‌హేంద‌ర్ రెడ్డి యువ‌సేన కబ‌డ్డీ పోటీలు

తాండూరు వికారాబాద్

ఆక‌ట్టుకున్న మ‌హేంద‌ర్ రెడ్డి యువ‌సేన కబ‌డ్డీ పోటీలు
– విజేతగా కోడంగ‌ల్ జ‌ట్టు, ర‌న్న‌రప్‌గా షాపూర్ తాండా జ‌ట్టు
– ర‌వీంద‌ర్ గౌడ్ స‌హాకారంతో న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేత
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూర్ మండలం అంతారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి పట్నం మహేందర్ రెడ్డి యువసేన కబడ్డీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన క‌బ‌డ్డీ పోటీల‌సు ఉత్స‌హంగా ముగిశాయి. మూడు రోజులుగా ఆక‌ట్టుకున్న ఈపోటీల‌లో వివిధ ప్రాంతాల నుంచి 15 కబడ్డీ జ‌ట్లు పాల్పంచుకున్నాయి. మూడో రోజు గురువారం ముగింపు రోజు అంతారం, షాపూర్ తాండ జ‌ట్లు తలపడగా షాపూర్ తండా ఫైనల్‌కు చేరుకుంది. అప్ప‌టికే ఫైన‌ల్‌కు చేరిన కొడంగల్ జ‌ట్టుతో షాపూర్ తాండా జ‌ట్టు పోటీ ప‌డ్డాయి. ఉత్కంఠ‌గా కొన‌సాగిన పోటీలో కోడంగల్ జ‌ట్టు విజేతగా నిలవ‌డంతో షాపూర్ తాండ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. పోటీల్లో విజేత‌, ర‌న్న‌రప్ జ‌ట్ల‌కు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్ట‌ర్, తాండూరు మండ‌లం ఎల్మ‌క‌న్నె స‌హాకార సంఘం చైర్మ‌న్ సంగెం ర‌వీంద‌ర్ గౌడ్ స‌హాకారంతో మొద‌టి బ‌హుమ‌తి రూ. 10 వేలు, రెండో బ‌హుమ‌తికి రూ. 5వేలును ప్ర‌క‌టించారు. ఆయ‌న అందుబాటులో
లేకపోవ‌డంతో తాండూరు మార్కెట్ క‌మిటి మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, అంతారం ఎంపీటీసీ శాంతు, టిఆర్ఎస్ నేతలు ఎస్ రాజ్ పటేల్, డేవిడ్, రజినీకాంత్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, అంతారం పట్నం మహేందర్ అన్న యువసేన కబడి టీం ఆధ్వర్యంలో విజేతలకు నగదుతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ‌కుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందు క‌బ‌డ్డీ పోటీలు నిర్వ‌హించిన మ‌హేంద‌ర్‌రెడ్డి యువ‌సేన స‌భ్యుల‌ను అభినందించారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌హాకారంతో క్రీడాకారుల అభివృద్దికి స‌హ‌కారం అందిస్తామ‌ని పేర్కొన్నారు.
ప‌లువురు క్రీడాకారులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో.. ఆయ‌న స‌హాకారంతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాల‌ని, క్రీడా పోటీల‌తో క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్స‌హించాల‌ని కోరారు. క్రీడా పోటీల్లో విజేత‌ల‌కు, ర‌న్న‌ర‌ఫ్ జ‌ట్టుకు న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించిన ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్, తాండూరు ఎల్మ‌క‌న్నె స‌హాకా సంఘం చైర్మ‌న్ ర‌వీంద‌ర్ గౌడ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.