ఉత్తమ వైద్యుడిగా డా.ప్రవీణ్ గౌడ్

ఆరోగ్యం కెరీర్ తాండూరు రాజకీయం

ఉత్తమ వైద్యుడిగా డా.ప్రవీణ్ గౌడ్
– జిల్లా ఆసుపత్రికి దక్కిన గౌరవం
– సిబ్బందికి కూడా అవార్డులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఉత్తమ వైద్యుడుగా తాండూరుకు చెందిన డా. ఎం.ప్రవీణ్ గౌడ్ నిలిచారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డా. ప్రవీణ్ గౌడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో ఆయన అందించిన వైద్య సేవలకు గాను ప్రభుత్వం ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్సు కృష్ణవేణి, పార్మాసిస్ట్ ఆర్. సుజాత, జూనియర్ అసిస్టెంట్ బీఎన్ కార్తిక్ కుమార్, లాబ్ టెక్నిషీయన్ చెన్నమ్మ, ఆఫీస్ అటెండర్ నర్సింలుకు కూడా ఉత్తమ అవార్డులు అందజేశారు. ఉత్తమ అవార్డులు అందుకున్న డా. ప్రవీణ్ గౌడ్ తో పాటు సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!