బిల్వ ఆకులు చేసే మేలు తెలుసా..?
– గుండె, ఎముకల, దంతాల వ్యాధులన్ని నయం
– ఇంకా మరెన్నో ప్రయోజనాలు
దర్శిని డెస్క్: బిల్వ ఆకు దీనిని మారెడు ఆకు అని కూడా పిలుస్తారు. శివునికి పీతిపాత్రమైన మారేడుకు ఆయుర్వేధంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అలాగే అనేక రోగాలకు దివ్యౌషధంగా చెబుతారు. ఆకులే కాదు.. కాయలు, పూలు, కాండం, వేర్లు కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.
బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. బిల్వలో వుండే ఇనుము రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. మారేడుతో గుండె- కాలేయ వ్యాధులకు వ్యతిరేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా మరిన్ని ప్రయోజాలు కూడా తెలుసుకుందాం…
మలబద్ధకం, విరేచనాలు, ఆయాసం జలుబు లాంటి సమస్యల నివారణకు బిల్వ ఫలం బాగా సాయపడుతుంది.
ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
గర్భిణులకు వచ్చే ఒళ్లు నొప్పులు తగ్గాలంటే.. మారేడు ఆకులను వేడినీటిలో వేసి స్నానం చేయాలి.
వేర్లను చూర్ణం చేసి.. హాఫ్ టీ స్పూన్ చొప్పున కషాయంగా చేసి తీసుకుంటే దగ్గు, జ్వరం తగ్గుంమది.
అధిక వేడితో బాధ పడే వారికి మారేడు ఆకులు గొప్ప ఔషధంగా పని చేస్తాయి.
(నోట్: కేవలం అవగాహన కోసం మాత్రమే అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇది కూడా చదవండి..

