ఎల్‌ఆర్‌ఎస్‌పై దర్నా జయప్రదం చేద్దాం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎల్‌ఆర్‌ఎస్‌పై దర్నా జయప్రదం చేద్దాం
– తాండూరులో నిరసనకు తరలిరండి
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫీజుల వసూలు కోసం కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ఎల్‌ఆర్ఎస్‌ పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దర్నా నిర్వహించడం జరుగుతుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ దర్నా జరుగుతుందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాటమార్చారని అన్నారు.

ఎల్‌ ఆర్‌ ఎస్‌ కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా బుధవారం నిర్వహించే వ్యతిరేక నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజలు తరలివచ్చి దర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 7న కలెక్టర్లు, ఆర్డీవోలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!