ఒంటిపూట బడులకు అనుగుణంగా బస్సులు నడిపించండి
– డీపో మేనేజర్‌కు టీఆర్ఎస్వీ నాయకుల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల పాఠశాల, కళాశాల సమయాలకు అనుకూలంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ పవిత్రను టీఆర్ఎస్వీ నాయకులు తాండూరు ఇంచార్జ్ జిలాని, వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయలను కోరారు. బుధవారం డీపో మేనేజర్ పవిత్రను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉయదం, మధ్యాహ్నం, సాయంత్రం వేళ విద్యార్థుల సమాయాలకు అనుకూలంగా బస్సుల నడిపించి విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


