వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..!
– అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణం
– సంఘటనా స్థలాన్ని పరశీలించిన డీఎస్పీ
– దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో కలకలం రేపిన వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ ఆయన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వెంకటేష్‌ భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరిలో పోలీసుల అదుపులో ఉన్నారు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వెంకటేష్ మరణం వెనుక కారణాలను ఆరా తీశారు. మరోవైపు వెంకటేష్ అనుమానాస్పద మృతి సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేష్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని గుంతు వద్ద కమిలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మృతుని తల్లి, కుటుంభీకులు కీలక విషయాలను వెల్లడించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ (32)కు పదేండ్ల క్రితం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో వివాహాము జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేష్ గనుల్లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు.

అయితే భార్య, భర్తల మద్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య జయశ్రీ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని మూడేళ్ల క్రితం వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. పిల్లల కోసం తిరిగి రావడంతో భర్త వెంకటేష్ హెచ్చరించి ఇంట్లోకి రానిచ్చాడు. కొన్నాళ్లు భార్య, భర్తలు బాగానే ఉన్నారు. జయశ్రీతో పాటు ఆమె తండ్రి పండరి కూడా వారి వద్దే ఉంటున్నాడు. అయితే జయశ్రీ ప్రవర్తనలో మార్పు రాకుండా ఇతరులతో మాట్లాడుతుందని మరోసారి భర్త వెంకటేష్ ఆమెను హెచ్చరించాడు. దీంతో తన వ్యవరాహాలకు భర్త అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది.
kvcs
ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేష్ను భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరీలు గొంతు నులిమి హత్య చేశారు. సోమవారం తెల్లవారు జామున వెంకటేష్‌కు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అనుమానం కలిగిన స్థానికులు ప్రశ్నించడంతో వెంకటేష్ మృతి చెందినట్లు గుర్తించారు. విషయాన్ని కరణ్ కోట్ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరిలను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తల్లి అంజిలమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు రూరల్ సీఐ నగేష్ తెలిపారు. అక్రమ సంబంధం ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నామని అన్నారు. సమగ్ర విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర