తాండూరులో ఉచిత వైద్య శిబిరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

తాండూరులో ఉచిత వైద్య శిబిరం
– చర్మం, వెంట్రుకలు, మానసిక సమస్యలపై చెకప్
– మూడు రోజుల పాటు వైద్య సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలకు న్యూ లోటస్ హస్పిటల్‌ యజమాన్యం శుభవార్త చెప్పింది. పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న హస్పిటల్లో మూడు రోజులు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారంతో పాటు 16, 17వ తేదిలలో ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2-30 గంటల వరకు, సాయంత్రం 4-30 గంటల నుంచి 8 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు. మానసిక సమస్యలతో పాటు, చర్మ వ్యాధులు గజ్జి తామర, దురద, దద్దుర్లు, చుండ్రు తదితర సమస్యలతో పాటు జుట్టు రాలడం వంటి వెంట్రుక సమస్యలపై ఉచిత చెకప్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి వైద్యులు నూరిన్ జహాన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని సూచించారు.

లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!